Jai Ho

3 Scientists Get Nobel Prize In Physics | ఫిజిక్స్‌లో ముగ్గురు అమెరికన్ శాస్త్రవేత్తలకు నోబెల్‌

Jai Ho

Jai Ho

Educational videos and stories

By ETV TelanganaFrom YoutubeOctober 14, 2025

డిజిటల్ టెక్నాలజీని మరింత ఆధునికంగా మార్చే అస్పష్టమైన క్వాంటం టన్నెలింగ్ పై పరిశోధనలు చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలకు...... ఫిజిక్స్ విభాగంలో నోబెల్ దక్కింది. జాన్ క్లార్క్ , మైకేల్ హెచ్ డెవోరెట్ , జాన్ ఎమ్ మార్టినిస్ లకు సంయుక్తంగా.......... 2025 ఫిజిక్స్ నోబెల్ ను ప్రకటించారు. ముగ్గురు పరిశోధకులు..... యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో పనిచేస్తున్నారు. మార్టినిస్ యోల్ యూనివర్శిటీలో..... కూడా పనిచేస్తున్నారు. 1980ల్లో ముగ్గురు శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన....... ఇప్పటికీ తదుపరి తరం క్వాంటం టెక్నాలజీ, క్వాంటం క్రిఫ్టోగ్రఫీ, క్వాంటం కంప్యూటర్స్, క్వాంటం సెన్సార్ల తయారీకి కొత్త అవకాశాలు కల్పిస్తోందని నోబెల్ కమిటీ తెలిపింది. శతాబ్దం క్రితం నాటి క్వాంటం మెకానిక్స్ నిరంతరం కొత్త ఆశ్చర్యాలకు తెరతీస్తూనే ఉందన్నారు. అన్ని రకాల డిజిటల్ టెక్నాలజీకి.. క్వాంటం మెకానిక్స్ పునాది వంటిదని...... నోబెల్ కమిటీ ఛైర్మన్ ఒల్లె ఎరిక్స్ సన్ తెలిపారు. 100ఏళ్ల నాటి క్వాంటం మెకానిక్స్...... సూక్ష్మ పరమాణు ప్రపంచంలో అసాధ్యమైన విషయాలను అధ్యయనం చేస్తుంది. స్విచ్ లు ఒకేసారి ఆన్, ఆఫ్ లో ఉండగానే........ అణువుల భాగాలు అసాధ్యమైన అడ్డంకులను.......... దాటతాయి. ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన కంప్యూటింగ్, కమ్యూనికేషన్ లను..మరింత శక్తివంతం చేస్తుందని నోబెల్ కమిటీ తెలిపింది.

#Three-Scientists
#Nobel-Prize-In-Physics
#Physics-Discovery
#American-Scientists
#Scientific-Achievement
#Physics-Award
#Science-News
#Inspirational-Scientists
#Physics-For-Kids
#Educational-Stories
#Scientific-Tales
#Life-Lessons
#Innovative-Science
#Best-Science-Stories
#Story-Time-With-Sudha-Amma

0 Comments

Public comments are shown after moderator approval.

Add a comment

Comments are reviewed before they are visible to everyone.

No comments yet

Be the first to share a thought. Comments appear after moderation.